Adduri Sriram Protest : ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత
ఎన్టీఆర్ జిల్లాలో(NTR District) ఉద్రిక్తత చోటుచేపుకుంది. బీజేపి(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై(Purandeswari) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy),

Adduri Sriram Protest
ఎన్టీఆర్ జిల్లాలో(NTR District) ఉద్రిక్తత చోటుచేపుకుంది. బీజేపి(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై(Purandeswari) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy), మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati rambabu) చేసిన వాఖ్యలకు నిరసనగా విజయవాడ 1 టౌన్ కేబీఎన్ కాలేజ్ సెంటర్ లో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్(Adduri Sriram) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రంగంలోకి దిగన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకులకు మద్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
