నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని

నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన మీద వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని ఆయన అన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా.. అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన వివరించారు

నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆదాల.. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నానన్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్‌సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని కలుస్తానన్నారు ఎంపీ ఆదాల. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మా గుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చలు జరిపాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. కానీ, నా ప్రయత్నం ఫలించలేదని, అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పానన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నారని, వైసీపీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని అంటున్నారని తెలిపారు.

Updated On 14 Feb 2024 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story