సినీనటి శ్రీ రాపాక(Actress Sri Rapaka) రాజకీయాల్లోకి(Politics) రావాలనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో(YSRCP) చేరారు. ముఖ్యమంత్ర జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఆశీర్వదిస్తే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) బరిలో దిగుతానని చెప్పారు.

సినీనటి శ్రీ రాపాక(Actress Sri Rapaka) రాజకీయాల్లోకి(Politics) రావాలనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో(YSRCP) చేరారు. ముఖ్యమంత్ర జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఆశీర్వదిస్తే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) బరిలో దిగుతానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం నిర్మలగిరి మాత ఆలయాన్ని సందర్శించుకున్న శ్రీ రాపాక కాసేపు మీడియాతో ముచ్చటించారు. చిన్నప్పట్నుంచి ప్రజలకు సేవ చేయడమంటే ఇష్టమని, ఇప్పటి వరకు గోపాలపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. ప్రజలకు మరింత సేవలను అందించడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఆయన అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికలలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, భారీ మెజారిటీ విజయం సాధించి జగన్‌కు కానుకగా అందిస్తానని శ్రీ రాపాక తెలిపారు.

Updated On 17 Jan 2024 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story