తన విషయంలో కొన్ని మీడియా సంస్థలు తన విషయంలో మౌనంగా ఉంటున్నాయని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత వాపోయారు.

తన విషయంలో కొన్ని మీడియా సంస్థలు తన విషయంలో మౌనంగా ఉంటున్నాయని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత వాపోయారు. సోషల్‌ మీడియాలో తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్నారు. ' పచ్చ మీడియా ఎందుకు నా విషయం లో మౌనం గా ఉంది ?

తెలుగుదేశం వాళ్ళు బూతులు మాట్లాడితే వినిపించలేదా? జగన్ రెడ్డి మంచోడులా మారితే కనిపించలేదు.. ముసలాయన మాటలకి భయపడ్డారా? ఏమీ పాపం మహిళలు బూతులు ఇదేం సమాజం.. ఇదేం న్యాయం అంటూ రెచ్చిపోయిన సోషల్ సైకోలు ఇలా ఉన్నారేంటి

గత పాలనలో గలీజ్ మాటలు ఇది చండాలం అని నోరు చించుకుని అరిచిన మీడియా నోరు ఇపుడు నా విషయంలో ఎందుకు మూతపడింది.

విచిత్రం ఏమిటంటే ఈ పెద్ద విలేకరులు నా మిత్రులే కానీ పచ్చమీడియా లో ఉండటం కారణంగా మౌన వ్రతం పాటిస్తున్నారా..

సొంత పార్టీ నంగా మాటలు మూసివేస్తున్నారా.. పక్క పార్టీ మీద లేచిన నోర్లు సొంత పార్టీ నాయకుల విషయంలో ఎందుకు పడుకున్నాయి ?

ఇదేనా మీ ద్వంద నీతి ? ఇదేనా మీ ధోరణి ?? ఇదేనా మీరు చూపిస్తున్న 4th pillar సోషల్ జస్టిస్.. అపుడు లేచిన నోర్లు ఇపుడెందుకు లేవడం లేదు ??? మీ పార్టీ మహిళలే మహిళలా ?? మేము కాదా? ఎక్కడ పోయారు పచ్చ మీడియా వాళ్ళు? నాకు మీతో వైర్యం లేదు.. ఇపుడు మీ విధానం సమ్మతంగా లేదు.. మీ ప్రభుత్వానికి వైసీపీ సైకోస్ తప్ప సొంత పార్టీ సైకోస్ కనిపించరా?.. ఐతే మీరు ధర్మం తప్పుతున్నారు.. సెలెక్టివ్ జర్నలిజం చేస్తున్నారా ? అనే అనుమానం వస్తుంది నాకు అని పోస్టు పెట్టారు.

కొందరు పొట్ట, బట్ట ఉన్న అంకుల్స్ మరి కొంతమంది సైకోస్ నన్ను ముసలిదానివి అయిపోయావు అంటున్నారు.. వయసు జీవితం శాశ్వతం వాళ్ళకి కూడా కాదు అనే నిజం ఎలా మర్చిపోయారు? నా ఏజ్ వచ్చేసరికి మరణం అంచులో ఉండే యువత.. నన్ను అంటుంటే.. నా ఒక్కదానికి వయసు అవుతుందా.. మీరంతా శాశ్వత జీవులా అనే డౌట్ వస్తుంది సుమీ.. సృష్టి ధర్మం నేను గౌరవిస్తాను.. ఔను నేను పుట్టాను పెరిగాను. నాకు వయసు అవుద్ది. కొన్నాలకి మరణిస్తాను దీన్ని ఆపగలిగే దమ్మున్న మనుషులు శాశ్వతంగా ఉండండి. మా ఊర్లో ఒక సామెత చెప్తారు అర్ధరాత్రి చచ్చేవాడు తెల్లారు ఝామున చచ్చేవాడి చావు కోరుకున్నాడట. ఔను నాకు వయసు పెరుగుద్ది.. చర్మం ముడతలు వస్తాయి. తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం.. సహజం ….. మీరు నన్ను ఆంటీ అన్న అవ్వ అన్నా నాకేం సమస్య లేదు. సమస్య మీ మెదడులో ఉంది అనే సంగతి గమనించి నాకోసం ఆలోచన చేసే సమయం మీకోసం చేస్తే కనీసం నా ఏజ్ వచ్చేసరికి అంకుల్ కాకుండా ఉంటారు. 50 ఏళ్ల అంకుల్ నన్ను ఆంటీ అని పిలిస్తే అతని ఆలోచన స్థాయి ఏమిటి? మీరెలా పిలిచినా మీ వయస్సుని ఆపలేను.. నా మనసుని మార్చలేరు.. ఆపాలి అనే ఆలోచన నాకు లేదు. శాశ్వత అందం కావాలని కోరిక లేదు, మీ సంస్కారానికి నా పాదాభివందనాలు. నన్ను దూషణ మానేసి వయసైన మీ అమ్మానాన్నలకి అన్నం పెట్టండి.. నన్ను దూషించిన పాపం పోతుంది.. శత్రు వినాశన ప్రాప్తిరస్తు అంటూ మాధవీలత మరో పోస్టు చేశారు.

ehatv

ehatv

Next Story