మాధవీలత, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.

మాధవీలత, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీకి మహిళలు వెళ్లకూడదని చేసిన మాధవీలత వ్యాఖ్యలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఓ ప్రాస్టిట్యూట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత కూడా మండి పడ్డారు. ఈ వివాదం ఇలా నడుస్తున్న క్రమంలో మాధవీలత సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. సెల్ఫీ వీడియోలో ఆమె ఏడ్చుతూ కనపడింది. ఈ సందర్భంగా తను ఓ పోస్టు కూడా చేసింది. ''చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే …నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి … ..నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం ..అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు , పదే పదే ఇవే మాటలన్నారు ఎవరో వస్తారని ఎప్పుడు ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్నా. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతుగా నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికీ ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడు నేను sympathy game ఆడలేదు women favor laws ని ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు.. క్షమించండి … మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి …మీ మాధవీలత'' అంటూ ఏడుస్తూ పోస్టు చేసింది

ehatv

ehatv

Next Story