ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఓ విషయం చెప్పాలని ఉందన్నారు నటుడు షాయాజీ షిండే

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఓ విషయం చెప్పాలని ఉందన్నారు నటుడు షాయాజీ షిండే. గుళ్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఓ మొక్కను ఇవ్వాలని సూచించారు. తాను ఇప్పటికే ఆ పని చేస్తున్నానని చెప్పారు. సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా నటించిన కొత్త సినిమా మా నాన్న సూపర్‌హీరో (Maa Nanna Superhero) ఈ నెల 11న విడుదల కాబోతుంది. ఆర్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో షాయాజీ షిండే(Sayaji Shinde) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్‌, షాయాజీ, ఆర్నాలు ‘బిగ్‌బాస్‌ సీజన్‌-8లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాయాజీ షిండే గురించి సుధీర్‌బాబు ఓ విషయం చెప్పారు. ఖాళీ ప్లేస్‌ కనిపిస్తే చాలు షిండే ఓ మొక్కను నాటుతారని వ్యాఖ్యాత నాగార్జునతో అన్నారు. ఆశ్చర్యపోయిన నాగార్జున(Nagarjuna) అందుకు కారణాన్ని షిండేని అడిగి తెలుసుకున్నాడు. 'మా అమ్మ 1997లో కన్నుమూసింది. నా దగ్గర అవసరానికి సరిపడేంత డబ్బున్నా అమ్మను బతికించుకోలేకపోయాను. ఆ విషయం ఆమెతోనే చెప్పాను. నీ బరువుకు సరితూగే విత్తనాలను దేశమంతటా నాటుతానని అమ్మకు మాటిచ్చాను. నేను నాటిన విత్తనాలు వృక్షాలుగా మారి, పూలు, పండ్లు ఇస్తాయి. నీడనిస్తాయి. ఆ పచ్చటి చెట్లను చూసినప్పుడు మా అమ్మ గుర్తుకువస్తుంది. అమ్మ తర్వాత అమ్మగా నాకు భూదేవి గుర్తుకొస్తుంది. సాధారణంగా గుళ్లకు వెళ్లేవారికి ప్రసాదాలు ఇస్తారు. దాంతో పాటు ఓ మొక్కను కూడా ఇస్తే బాగుంటుంది. ఆ మొక్కను నాటితే అందులో దేవుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు గుడులలో నేను ఈ విధానం ప్రారంభించాను. అయితే, అందరికీ అలా మొక్కలు ఇవ్వరు. ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తాము. పవన్‌కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ దొరికితే ఆయనకు ఈ వివరాలన్నీ చెబుతాను' అని షాయాజీ షిండే చెప్పుకొచ్చారు.

ehatv

ehatv

Next Story