ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)సఖ్యతగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అక్కడ అక్కడ కొన్ని ప్రాంతాల్లో క్యాడర్‌ మధ్య విభేదాలు వస్తున్నా కానీ వాటిని ఆయా నియోజకవర్గాల్లోనే అదుపులో ఉంచుతున్నారు. కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు(Janasena Leaders) మదనపడుతున్నారు. ప్రభుత్వంలో పెత్తనమంతా టీడీపీ (TDP)కార్యకర్తలదే నడుస్తోందని వాపోతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ ఇంచార్జులదే హవా కొనసాగుతోందని జనసేన క్యాడర్‌ కొంత నైరాశ్యంలో ఉంది. అయితే తాజాగా జనసేన సభలో నాగబాబు(Nagababu), పవన్‌ వ్యాఖ్యలతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వార్‌ మొదలైంది. పిఠాపురం(Pitapuram)లో పవన్‌ గెలుపు కేవలం పవన్‌ చరిష్మా, పిఠాపురం ప్రజల వల్లనేనని ఈ గెలుపు ఏ ఒక్కరిదో కాదని అలా అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు వ్యాఖ్యానించడంతో టీడీపీ క్యాడర్‌కు ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో మన పార్టీ నిలబడింది, 40 ఏళ్ల పార్టీని నిలబెట్టాం అని అనడంతో టీడీపీ క్యాడర్‌ అగ్గిమీద గుగ్గిలంమయ్యారు. సోషల్‌ మీడియాలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు బూతులతో తిట్టుకుంటున్నారు. ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ దేనిని వదిలిపెట్టకుండా కామెంట్స్‌ చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై యాక్టర్‌ పృథ్వీరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ " నువ్వు తగ్గే వరకు నేను తగ్గను " ఇది ఈనాటి పొత్తులోవున్న కార్యకర్తల మాట. ఈ గొడవ ఎప్పటికి సద్దుమనుగుతుందో దేవునికే ఎరుక'' అంటూ పోస్ట్‌ పెట్టారు. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. 2029లో జగన్‌ (Ys Jagan)వచ్చేవరకు వారి మధ్య ఇది నడుస్తూనే ఉంటుందని ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా.. ముగ్గురు అన్నదమ్ములకు పదవులు వస్తే ఏ ఇబ్బంది ఉండదని మరొకరు కామెంట్‌ చేశారు.

ehatv

ehatv

Next Story