Actor Prakash Raj Vs Pawan Kalyan : పవన్-ప్రకాష్‌రాజ్ మధ్య కొనసాగుతున్న ట్వీట్ పోరు..!
పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్ మధ్య వెండితెరపై ఎన్నో ఫైటింగ్ సీన్లు చూశాం.

పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్ మధ్య వెండితెరపై ఎన్నో ఫైటింగ్ సీన్లు చూశాం. కానీ ఇప్పుడు రాజకీయరంగంలో కూడా వీరి మధ్య ట్వీట్ల యుద్ధాన్ని చూస్తున్నాం. పవన్ వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు ప్రకాష్‌రాజ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. పవన్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు వదులుతూనే ఉన్నారు. పిఠాపురం వేదికగా హిందీ భాషపై పవన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మరోసారి ప్రకాష్‌రాజ్ స్పందించారు. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై పవన్ చేసిన కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. “తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దని” పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి.. ఇది ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమే,” అంటూ పవన్ కల్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్.. అంటూ ట్వీట్ చేశారు. #justasking హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా హిందీని వ్యతిరేకించేవారు మాత్రం ప్రకాష్‌రాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
