ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని కోపం పెంచుకున్న యువకుడు ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లా(Annamayya district)లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువకుడు యువతిపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్(Srikanth) అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్(Ganesh) ప్రేమించాలని ఆమెను వేధించాడు. ఆమె తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ehatv

ehatv

Next Story