శ్రీశైలం క్షేత్రంలో మరోసారి ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు గతంలో దేవస్థానం చేపట్టిన సుమారు 50 కోట్ల రూపాయల పలు ఇంజనీరింగ్ పనులలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు అయితే కోట్ల రూపాయల అవకతవకల జరిగాయని వచ్చిన ఆరోపణలతో కర్నూలుకు చెందిన ఏసీబీ సిఐ విశ్వనాథ ఆద్వర్యంలో తమ సిబ్బందితో కలసి శ్రీశైలం దేవస్థానం నిర్వహించిన మాడవీధులు , ఔటర్ రింగ్ రోడ్ పుష్కరిణి పాతాళగంగ వద్ద నిర్వహించిన పనులపై ఏసిబి అధికారులు ఆరా తీశారు

శ్రీశైలం క్షేత్రంలో (Srisailam) మరోసారి ఏసీబీ (ACB) అధికారుల తనిఖీలు నిర్వహించారు గతంలో దేవస్థానం చేపట్టిన సుమారు 50 కోట్ల రూపాయల పలు ఇంజనీరింగ్ పనులలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు అయితే కోట్ల రూపాయల అవకతవకల జరిగాయని వచ్చిన ఆరోపణలతో కర్నూలుకు చెందిన ఏసీబీ సిఐ విశ్వనాథ ఆద్వర్యంలో తమ సిబ్బందితో కలసి శ్రీశైలం దేవస్థానం నిర్వహించిన మాడవీధులు , ఔటర్ రింగ్ రోడ్ పుష్కరిణి పాతాళగంగ వద్ద నిర్వహించిన పనులపై ఏసిబి అధికారులు ఆరా తీశారు అభివృద్ధి పనులను దేవస్థానం అధికారులతో కలిసి క్షేత్రంలో పరిశీలన చేశారు రోడ్లు మాడవీధులు కొలతలు వేశారు పలు దస్త్రాలను తనిఖీలు నిర్వహించారు మొదటగా ఔటర్ రింగ్ రోడ్డు,ఆలయ మాడ విధులు,ఆలయ పుష్కరిణి పనులను ప్రతి ఒక్కటీ క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు స్వయంగా పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు వేసిన రోడ్లను,కొలమానలను నాణ్యతను పరిశీలించారు అయితే మరో రెండు రోజులపాటు శ్రీశైలంలోని ఇంజనీరింగ్ విభాగం చేసిన పనులను పరిశీలిస్తామని ఏసీబీ సిఐ విశ్వనాథ అధికారులు తెలిపారు...అనంతరం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు

Updated On 5 July 2023 3:29 AM GMT
Ehatv

Ehatv

Next Story