వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ(Vidadala Rajini)పై ఏసీబీ కేసు నమోదు చేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజినీ(Vidadala Rajini)పై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఓ ఐపీఎస్‌ అధికారి మీద కూడా కేసుపెట్టారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్(Sri Lakshmi Balaji Stone Crusher) నిబంధనలు పాటించడం లేదని, లంచం ఇవ్వకుంటే మూతపెట్టిస్తామని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2020 సెప్టెంబరు 4న రజినీ పిఏ దొడ్డా రామకృష్ణ వెళ్లి క్రషర్ వారిని బెదిరించారని, ఆ తరువాత విజిలెన్స్ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా క్రషర్‌ యాజమాన్యాన్ని పిలిపించి 2021 ఏప్రిల్ 4న రజినీ మరిది విడదల గోపీకి రూ. 2కోట్లు ఇప్పించారని, తాను రూ. 10 లక్షలు తీసుకుని, రామకృష్ణకు రూ. 10 లక్షలు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా(harish Kumar Gupta) విచారణ చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇప్పించారు. నివేదిక ఆధారంగా ఏసీబీ(ACB) వారు కేసు నమోదు చేశారు. అవినీతి కేసు కావడం వల్ల రజినిని అరెస్ట్ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. విడుదల రజినీకి వ్యతిరేకంగా ఉన్న మర్రి రాజశేఖర్(Marri Rajashekar) ఈ మధ్యే వైసీపీ(YCP)కి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీ(TDP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతా కలిసి తనపై కుట్రపన్ని నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారని, దేనినైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రజిని ప్రకటించారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ఆమె చెప్తున్నారు. నిజాలు బయటకు వచ్చిన తర్వాత మీ మొహాలు ఎలా ఉంటాయో చూసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు రజిని.

ehatv

ehatv

Next Story