చంద్రబాబు కస్టడీ పిటిషన్(Chandrababu Custody Petition) పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court) మరోసారి వాయిదా వేసింది. కోర్టు తీర్పును సాయంత్రం 4 గంటలకు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు ఉద‌యం 11.30 గంటలకే తీర్పు వెలువరించాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది.

సీఐడీ కస్టడీ పిటిషన్‌పై(CID Custody Petition) బుధవారం కోర్టులో సుమారు మూడు గంటలకు పైగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా(Siddharth Luthra), అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా తీర్పును మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా వేసింది.

ఇదిలావుంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్ కోరుతూ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది హైకోర్టు.

Updated On 21 Sep 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story