Breaking News : చంద్రబాబుకు బిగ్ షాక్.. సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill development scam case) టీడీపీ అధినేత చంద్రబాబును(chandrababu) సీఐడీ కస్టడీకి(CID Custody) అనుమతిస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబు కస్టడీ పిటీషన్(Custody petition) పై ఉత్కంఠకు తెరపడింది.

Breaking News
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill development scam case) టీడీపీ అధినేత చంద్రబాబును(chandrababu) సీఐడీ కస్టడీకి(CID Custody) అనుమతిస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబు కస్టడీ పిటీషన్(Custody petition) పై ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను సీఐడీ అధికారులు విచారించనున్నారు.
హైకోర్టులో క్వాష్ పిటీషన్(Quash Petition) కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు.. చంద్రబాబును సీఐడీకి అప్పగించే విషయంలో కస్టడీ పిటీషన్ పై తీర్పు చెప్పింది. చంద్రబాబును తమకు కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ అధికారులు వేసిన పిటీషన్‌పై రెండు రోజుల క్రితం ఐదు గంటల పాటు విచారణ సాగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు.
