✕
టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతించింది.

x
ACB Court Approves Pt Warrant In Ap Fibernet Case On Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court)లో షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసు(AP Fibernet Case)లో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఐడీ(CID) వేసిన పీటీ వారంట్ పై వాదనలను విన్న తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్(Dammalapati Srinivas), సీఐడీ తరపున వివేకానంద(Vivekananda) వాదనలు వినిపించారు.

Yagnik
Next Story