ఏపీ ఫైబర్ నెట్ కేసులో(AP Fiber Net) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై సీఐడీ(CID) వేసిన పీటీ వారెంట్‌పై(PT Warrant) నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం(ACB Court) శుక్రవారానికి వాయిదా వేసింది. బుధ‌వారం చంద్రబాబును(Chandrababu) ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో

ఏపీ ఫైబర్ నెట్ కేసులో(AP Fiber Net) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై సీఐడీ(CID) వేసిన పీటీ వారెంట్‌పై(PT Warrant) నిర్ణయాన్ని ఏసీబీ న్యాయస్థానం(ACB Court) శుక్రవారానికి వాయిదా వేసింది. బుధ‌వారం చంద్రబాబును(Chandrababu) ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండటంతో.. సీఐడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేయడంతో.. కోర్టు నిర్ణయం వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. అప్ప‌టివ‌ర‌కూ చంద్ర‌బాబును అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated On 18 Oct 2023 7:29 AM GMT
Ehatv

Ehatv

Next Story