పెమ్మసాని చంద్రశేఖర్‌(Pemasani chandrashekar). గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ(TDP) తరఫున పోటీ చేయబోతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, టికెట్‌ ఆల్‌మోస్టాల్‌ కన్ఫార్మ్‌ అయ్యింది. ఎన్‌ఆర్‌ఐ అయిన పెమ్మసాని 2014లోనే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు టికెట్ దొరక్కపోయేసరికి విదేశాలకు వెళ్లిపోయారు. మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. తెలుగుదేశంపార్టీ నుంచి గుంటూరు ఎంపీ బరిలో దిగబోతున్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్‌(Pemasani chandrashekar). గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ(TDP) తరఫున పోటీ చేయబోతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, టికెట్‌ ఆల్‌మోస్టాల్‌ కన్ఫార్మ్‌ అయ్యింది. ఎన్‌ఆర్‌ఐ అయిన పెమ్మసాని 2014లోనే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు టికెట్ దొరక్కపోయేసరికి విదేశాలకు వెళ్లిపోయారు. మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. తెలుగుదేశంపార్టీ నుంచి గుంటూరు ఎంపీ బరిలో దిగబోతున్నారు. సిట్టింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్‌ అక్కడ్నుంచి పోటీ చేయడానికి విముఖత చూపించడంతో పెమ్మసానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇవాళ పెమ్మసానికి చెందిన ఓ పెద్ద ప్రకటన ఓ దినపత్రికలో వచ్చింది. ఫుల్‌ పేజీ అడ్వర్‌టైస్‌మెంట్‌ టీడీపీ అనుకూల పత్రికలో కనిపించింది. ఆ మీడియా అధిపతి ఏ పత్రికలో అయితే పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన ఫుల్‌ పేజీ యాడ్‌ వచ్చిందో, ఆ పత్రికే, ఆ పత్రికా యజమానే పక్షం రోజుల కింద ఇదే పెమ్మసానిపై విషం కక్కింది. పెమ్మసాని లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఎలా అంటూ ఆక్రోశించింది. ఎన్‌ఆర్‌ఐల పేరుతో ఎన్నికల ముందు వచ్చి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి వారు పార్టీని పట్టించుకోరు, ప్రజలను పట్టించుకోరు అంటూ గగ్గోలు పెట్టింది. ఇలాంటి వారు రాష్ట్రానికి హానీకరం అంటూ గగ్గోలు పెట్టింది. నేరుగా పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు తీసుకుని ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తే ఎలా అని ప్రశ్నించింది. రాష్ట్రం బాగు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్‌ఆర్‌ఐల పేరుతో వస్తున్నవారిని అనుమతించవద్దని హితబోధన చేసింది. వీళ్లు స్వప్రయోజనాల కోసమే వస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని గొంతు చించుకుంది. గెలిస్తే ఇక్కడుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఓడిపోతే మాత్రం విదేశాలకు చెక్కేస్తారు, ఇలాంటి వారితో పార్టీకి కానీ, రాష్ట్రానికి కానీ ఏమిటి ప్రయోజనం అంటూ పెడబొబ్బలు పెట్టింది. అలా టీడీపీ మేలును, రాష్ట్రం మేలును కోరుతూ వచ్చిన ఆ పత్రిక మొదటి పేజీలో పెమ్మసాని లక్షలు ఖర్చు పెట్టి ఫుల్‌ పేజీ యాడ్‌ ఇచ్చారు. అంతే పత్రిక సంతృప్తి చెందింది. ఆ పెద్దమనిషి కూడా సంతృప్తి చెందాడు. ఇప్పుడా పత్రికకు పెమ్మసాని అమితంగా నచ్చేశారు. ఎందుకు నచ్చారంటే ఏం చెప్తాం? మనమే అర్థం చేసుకోవాలంతే! ఎవరిని ఏ రకంగా బెదిరిస్తున్నారు? ఎవరిని ఏ రకంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు? ఎవరితో ఏ రకమైన ప్రయోజనాలు తీసుకుంటున్నారు? అనే దానికి ఇదే బెస్ట్‌ ఎగ్జాంపుల్‌!

Updated On 4 March 2024 3:42 AM GMT
Ehatv

Ehatv

Next Story