AB Venkateswara Rao : జగన్ హత్యకు ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హత్యకు ఏబీ వెంకటేశ్వర రావు కుట్ర పన్నుతున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హత్యకు ఏబీ వెంకటేశ్వర రావు(AB Venkateswara Rao ) కుట్ర పన్నుతున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అంబేద్కర్ రాజ్యం నడవడం లేదని.. అంతా రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తోందని ఆయన అన్నారు. జగన్‌పై హత్యకు మరోసారి టీడీపీ(TDP) కుట్ర పన్నిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై హత్య కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని.. మాజీ డీజీ, మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఇంటికి జగన్‌పై దాడి చేసిన వ్యక్తి వెళ్లడం దేనికి సంకేతం..ఇది సరైందేనా అని ప్రశ్నించారు. జగన్ మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan Reddy)ని అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్ హత్య మిస్ అయ్యిందని, ఈసారి పక్కా ఈ ప్రణాళికతో ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అంతేకాకుండా జగన్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యాలను చూస్తే స్పష్టమవుతోందని ఆయన అన్నారు..NIA చార్జిషీట్‌లో జగన్‌పై అటాక్ చేశారని, ప్రీ మర్డర్ ప్లాన్ చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చిందని చెప్పారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లను వెంకటేశ్వర్ రావు ట్యాప్ చేశారని అన్నారు.వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చి బయట తిప్పడం దేనికి సంకేతమని అడిగారు.
