ఓ యువతికి అద్భుతమైన ఆలోచన వచ్చింది.

ఓ యువతికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. బాయ్‌ఫ్రెండ్‌ తన నెంబర్‌ను బ్లాక్‌ చేశాడని ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల సహాయం కోసం చేసే 100కు ఫోన్‌చేసింది. బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ‘అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్‌బ్లాక్ చేయించండి’ అని ఫోన్ రాగా.. గుత్తి PS బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే, తన ఇంటికి రావొద్దని నంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. దీంతో PSకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు ఆమెకు సూచించారు.

ehatv

ehatv

Next Story