వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysrcp) నాయకుల ప్రణయగాధలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysrcp) నాయకుల ప్రణయగాధలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా(Krishna District)కు చెందిన ఓ వైసీపీ నాయకుడి ప్రేమకథ బయటపడింది. ఆయన మనసు పారేసుకున్నది ముంబాయి(Mumbai)కి చెందిన ఓ నటిపైన! నటి అంటే టాప్‌ స్టార్‌ అనుకునేరు.. మామూలు నటే! హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వైసీపీ నేతకు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఈయన 2014 ఎన్నికలలో విజయవాడ(Vijayawada)కు పక్కనే ఉన్న ఓ నియోజకవర్గం నుంచి ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త! విశాఖపట్నం(Vishakapatnam)పోర్టులో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం ఉంది. ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. తండ్రి తరగనంత ఆస్తి సంపాదించడంతో కొడుకు ఇప్పుడు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రేమకథకు వద్దాం. చాలా కాలం ముంబాయి నటితో ప్రేమలో ఆయన మునిగిపోయారు. ఇలా అయితే కష్టమేననుకున్న ఆ నటి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఆయనేమో చేసుకోవడం కుదరన్నాడు. దాంతో ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది. నాయకుడు బెదిరిపోయాడు. ఆమెను ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. వైసీపీ సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సలహాదారు సలహా అడిగాడు. ఆయన చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఆమెపైనా ఆమె కుటుంబసభ్యులపైనా కేసు పెట్టాడు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేశారని కంప్లయింట్‌లో రాశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తికి సంబంధించిన కేసు కాబట్టి పోలీసులు కూడా వెంటనే రియాక్టయ్యారు. విజయవాడ నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం ముంబాయికి వెళ్లింది. ఆ నటిని, ఆమె కుటుంబసభ్యులను అరెస్ట్‌ చేసి ఇబ్రహీంపట్నం తీసుకువచ్చింది. పెళ్లి ప్రస్తావన ఎత్తవద్దని ఆమెను బెదిరించారు పోలీసులు. హడలిపోయిన నటి కుటుంబసభ్యులు పెళ్లి విషయం జోలికి వెళ్లబోమంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. దాంతో నటిపై నమోదైన చీటింగ్ కేసును పోలీసులు మూసివేశారు.

ehatv

ehatv

Next Story