రోహిణి కార్తె(Rohini Karte)లో రోళ్లు పగులుతాయన్నది నానుడి! నిజంగానే రోహిణి కార్తెలో అంతటి భయంకరమైన ఎండలు ఉంటాయి. ఆ పక్షం రోజులు అధిక వేడిగాలులు ఉంటాయి.. రోహిణి కార్తెకు ఇంకా నెల రోజులపైనే ఉంది. కానీ ఇప్పుడే బండలు పగలడం మొదలయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అధిక ఉష్ణోగ్రతతో కర్నూలు జిల్లా(Kurnool District) గోనెగండ్ల(Gonegandla)లోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి నిట్టనిలువునా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెద్ద చప్పుడు వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.

రోహిణి కార్తె(Rohini Karte)లో రోళ్లు పగులుతాయన్నది నానుడి! నిజంగానే రోహిణి కార్తెలో అంతటి భయంకరమైన ఎండలు ఉంటాయి. ఆ పక్షం రోజులు అధిక వేడిగాలులు ఉంటాయి.. రోహిణి కార్తెకు ఇంకా నెల రోజులపైనే ఉంది. కానీ ఇప్పుడే బండలు పగలడం మొదలయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అధిక ఉష్ణోగ్రతతో కర్నూలు జిల్లా(Kurnool District) గోనెగండ్ల(Gonegandla)లోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి నిట్టనిలువునా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెద్ద చప్పుడు వచ్చిందని గ్రామస్తులు చెప్పారు. వారు వచ్చి చూసేసరికి బండ పగిలి ఉందట. కొండరాయి పగిలిన దగ్గర నుంచి పొగలు రావడం, చిన్న చిన్న ముక్కలుగా రాయి పడిపోతుండటం వారు గమనించారట. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కొండరాయి పగిలిందని తాహసీల్దార్‌ కార్యాలయం ప్రకటించింది.

Updated On 10 April 2023 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story