Murder For 15 Lakhs Camera : కెమెరా కోసం యువకుడి ప్రాణాలు తీశారు.. కానీ ఓ యువతి జీవితాన్ని కాపాడిన మృతుడు..!
కెమెరా(Camera) కోసం ఓ యువకుడి ప్రాణాలు తీశారు. విశాఖ జిల్లా బక్కన్నపాలెం గ్రామానికి చెందిన సాయి విజయ్ పవన్ కల్యాన్(Sai Vijay Pawan kalyan) ఫొటోగ్రాఫర్(Photographer) వృత్తి నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన సాయి విజయ్ ఇంటర్ చదివిన తర్వాత ఈ వృత్తిలో స్థిరపడ్డాడు. కానీ తన వృత్తిలో మరింత ఎదగాలంటే అధునాతన కెమెరా కావాలని అనుకున్నాడు. ఇందుకు తల్లిదండ్రులను ఒప్పించి రూ.15 లక్షల విలువైన కెమెరా కొనిపించుకొన్నాడు.
కెమెరా(Camera) కోసం ఓ యువకుడి ప్రాణాలు తీశారు. విశాఖ జిల్లా బక్కన్నపాలెం గ్రామానికి చెందిన సాయి విజయ్ పవన్ కల్యాన్(Sai Vijay Pawan kalyan) ఫొటోగ్రాఫర్(Photographer) వృత్తి నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన సాయి విజయ్ ఇంటర్ చదివిన తర్వాత ఈ వృత్తిలో స్థిరపడ్డాడు. కానీ తన వృత్తిలో మరింత ఎదగాలంటే అధునాతన కెమెరా కావాలని అనుకున్నాడు. ఇందుకు తల్లిదండ్రులను ఒప్పించి రూ.15 లక్షల విలువైన కెమెరా కొనిపించుకొన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అప్పో, సప్పో చేసి కుమారుడి కోరికను తల్లిదండ్రులు తీర్చారు. ఈ క్రమంలోనే ఫొటోగ్రాఫర్‌గా కూడా సాయి విజయ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. జీవితం అంతా సాఫీగా సాగిపోతే విధికి మాత్రం ఎక్కడో కుళ్లు పుట్టినట్లుంది. ఓ దుర్మార్గుడి దృష్టిలో పడ్డ సాయి విజయ్ అతగాడి చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ బీద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే..
సాయి విజయ్ పవన్ కల్యాణ్‌ను షణ్ముఖ తేజ(Shanmukha teja) అనే యువకుడు దారుణంగా హత్య(Murder) చేశాడు. షణ్ముఖ తేజది అంబేద్కర్ కోనసీమ(Ambedkar Konaseema) జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం. ఇతడి వృత్తి కూడా ఫొటోగ్రాఫరే. చిన్నాచితక ఈవెంట్లకు ఫోటోలు, వీడియోలు తీసి జీవనం కొనసాగిస్తుండేవాడు. ఈ క్రమంలో షణ్ముఖ్‌కు సోషల్ మీడియాలో విశాఖకు చెందిన డబ్బున్న యువతితో పరిచయం ఏర్పడింది. తనకు తాను ఓ కోటీశ్వరుడినని ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తన వృత్తి ఫొటోగ్రాఫరే అయినా చాలా కాస్ట్‌లీ కెమెరాలు వాడుతానని నమ్మబలికాడు. నువ్వు చెప్పేది నిజమే అయితే కెమెరాలను చూపించాలని యువతి కోరింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు షణ్ముగ్. ఎలాగైనా కాస్ట్ లీ కెమెరాను ఆ యువతికి చూపించాలనుకున్నాడు. దీంతో ఆన్‌లైన్‌లో వెతగ్గా విశాఖకు చెందిన సాయి విజయ్ గురించి తెలిసింది. సాయి కెమెరాను ఎలాగైనా దక్కించుకోవాలని స్కెచ్ వేశాడు. సాయిని చంపితే ఆ కెమెరా దక్కుతుందని ఆశించాడు. సాయి కెమెరాను తీసుకెళ్లి యువతికి చూపించి ట్రాప్ చేయాలని పన్నాగం వేశాడు. ఎదో ఈవెంట్ ఉందని సాయికి చెప్పి పిలిపించాడు. రావులపాలెం వచ్చిన సాయిని కారులో ఎక్కించుకొని సీటు బెల్టుతో గొంతునులిమి చంపాడు. మృతదేహాన్ని గోదావరిలో పూడ్చి పెట్టారు. అయితే అమాయకుడైన సాయికి ఏదో మూల అనుమానం కూడా వచ్చింది. రావులపాలెం వస్తూవస్తూ తన తల్లికి షణ్ముఖ్ తేజ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాడు. కారు నెంబర్‌ను కూడా ఫొటో తీసి తల్లికి పంపించాడు. మూడు రోజులైనా సాయి విజయ్ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షణ్ముఖ్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయగా స్విచాఫ్ వచ్చింది. షణ్ముఖ్ కాల్ డేటా పరిశీలించగా వైజాగ్‌కు చెందిన యువతితో పలుసార్లు మాట్లాడినట్లు తెలిసింది. దీంతో యువతి దగ్గరకు వెళ్లిన పోలీసులు ఆమె చేసినట్లుగా షణ్ముఖ్‌కు మెసేజ్ పెట్టారు. ఎక్కడున్నావని ప్రశ్నించగా అన్నవరంలో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే అన్నవరం వెళ్లిన పోలీసులు అక్కడ షణ్ముఖ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకువచ్చాయి. దీంతో షణ్ముఖ్ అసలు బండారం యువతికి తెలిసిపోయింది. షణ్ముఖ్‌కు సహకరించిన మరో వ్యక్తి వినోద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. . ప్రత్యక్షంగా కాకపోయిన పరోక్షంగానైనా మృతుడు సాయి విజయ్ చేసిన పనితో యువతి జీవితాన్ని కాపాడినవాడిగా నిలిచిపోయాడు. ఓ దుర్మార్గుడి చేతిలో యువతి మోసపోకుండా సహకరించాడని పోలీసులు సాయి విజయ్‌కు సెల్యూట్ చేశారు. మరోవైపు సాయి విజయ్ తల్లిదండ్రులు కొడుకును కోల్పోయి దుఖఃతీరంలో మునిగిపోయారు.