కార్తీక మాసంలో (Karthika masam)వనభోజనాలు జరుగుతుంటాయి.

కార్తీక మాసంలో (Karthika masam)వనభోజనాలు జరుగుతుంటాయి. అయితే గతంలో అన్ని కులాల వారు కలిసి వనభోజనాలకు వెళ్లేవారు. కానీ రానురాను అవి కులాల(Cast) వారిగా మారాయి. అన్ని కులాలు వనభోజన మహోత్సవం నిర్వహించడం సాధారణం. కానీ కమ్మవారి(Kamma community) వనభోజనాలు ప్రత్యేకంగా ఉంటాయి.దాదాపు వేలల్లో ఈ వనభోజనాలకు హాజరవుతుంటారు. ప్రతిసారి ఖమ్మం(Khammam) జిల్లాలో నిర్వహించే వనభోజనాలకు మరింత ప్రత్యేకత ఉంది. ఏటా 20-30 వేల మంది హాజరవుతుంటారు. కానీ ఈసారి దాదాపు అంతకు రెట్టింపు సంఖ్యలో 60 వేల మంది వన భోజనాలకు హాజరయ్యారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన కమ్మ మహాజన సంఘ వ‌న సమారాధన కార్యక్రమంలో ఎన్టీఆర్‌కు పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ రాముడు కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ దేవాలయ సెట్టింగులో ఉంచి పూజలు చేశారు. ఓవైపు వెంకటేశ్వర స్వామి.. మధ్యలో శంకరుడు ఆ పక్కనే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని ఉంచారు. వెంకటేశ్వర స్వామి, శంకరుడితో పాటు ఎన్టీఆర్‌కు కూడా పూజలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కమ్మ కులస్తులకు మరింత బలం చేకూరిందనే టాక్‌ నడుస్తోంది. అయితే ప్రతిసారి గొల్లగూడెం రోడ్డులో ఉండే చెరుకూరువారి మామిడితోటలో వనభోజనాలు జరుగుతాయి. అయితే గతంలో ఎప్పుడైనా చెరుకూరు వారి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించేవారు కానీ ఈసారి నిర్వాహకులు వేదికను మార్చారు. వైరా రోడ్ లోని వెలుగుమట్లలో 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ను వన సమారాధనకు ఎంపిక చేశారు. వేదిక మార్చినా కూడా అనూహ్యంగా దాదాపు 60 వేల మందికిపైగా కమ్మ కులస్తులు రావడం విశేషం.

Eha Tv

Eha Tv

Next Story