Lorry Accident In AOB : అల్లూరి జిల్లాలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అల్లూరి(Alluri) జిల్లా విషాదం చోటు చేసుకుంది. ఏవోబీలో(AOB) సిమెంట్ లారీ(Cement Lorry) బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఈ ప్రమాదం(Accident) జరిగింది. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయాలవగా.. వారిని వెంటనే ఆసుపత్రికి(Hospital) తరలించారు.

Lorry Accident In AOB
అల్లూరి(Alluri) జిల్లా విషాదం చోటు చేసుకుంది. ఏవోబీలో(AOB) సిమెంట్ లారీ(Cement Lorry) బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఈ ప్రమాదం(Accident) జరిగింది. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయాలవగా.. వారిని వెంటనే ఆసుపత్రికి(Hospital) తరలించారు. చిత్రకొండ(Chitrakonda) నుంచి జడంబోకు(Jandaboku) సిమెంట్ లోడు తీసుకెళ్తుండగా.. ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
