ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని గెల్చుకోవడానికి తెలుగుదేశం (TDP)పార్టీకి సహకరించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి వైసీపీ (YCP) సస్పెండ్‌ చేసింది. ఈ నలుగురు రేపోమాపో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇలాంటి వారు పార్టీలో ఇంకొందరు ఉంటారేమోనన్న అనుమానం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇదే అదునుగా టీడీపీ పార్టీ ఓ అడుగు ముందేకేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా చెబుతోంది. ఎన్నికలకు ఎంత కాదనుకున్నా ఏడాదిపైనే ఉంది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని గెల్చుకోవడానికి తెలుగుదేశం (TDP)పార్టీకి సహకరించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి వైసీపీ (YCP) సస్పెండ్‌ చేసింది. ఈ నలుగురు రేపోమాపో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇలాంటి వారు పార్టీలో ఇంకొందరు ఉంటారేమోనన్న అనుమానం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇదే అదునుగా టీడీపీ పార్టీ ఓ అడుగు ముందేకేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా చెబుతోంది. ఎన్నికలకు ఎంత కాదనుకున్నా ఏడాదిపైనే ఉంది. ఇటువంటి సమయంలో పార్టీ మారే సాహసం చేస్తారా? అన్నది అనుమానం.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLA's) టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారు పార్టీ మారి రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పకు శ్రీకారం చుట్టబోతున్నారని అయన సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇది అంతా నిజమేనా లేక టీడీపీ కలలు కంటోందా.. వైసీపీలో కల్లోలం నెలకుంటుందా?.. ఒకవేళ ఈ నలభై మంది టీడీపీలో చేరితే ఎవరికీ నష్టం.. ఏవరికి లాభం..?

Updated On 2 April 2023 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story