అనూహ్యంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాలను గెల్చుకున్న తెలుగుదేశం పార్టీ (TDP)ఆ వెంటనే తాము కూడా ఊహించని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Kota MLC)  కూడా గెలవడంతో టీడీపీకి సరికొత్త జోష్‌ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న విశ్వాసం ఆ పార్టీలో కనిపిస్తోంది.

అనూహ్యంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాలను గెల్చుకున్న తెలుగుదేశం పార్టీ (TDP)ఆ వెంటనే తాము కూడా ఊహించని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Kota MLC) కూడా గెలవడంతో టీడీపీకి సరికొత్త జోష్‌ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న విశ్వాసం ఆ పార్టీలో కనిపిస్తోంది. అంతేనా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు(YSRCP MLAs) చాలా మంది తెలుగుదేశంలోకి రావడానికి ఉత్సాహపడుతున్నారంటూ టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. పార్టీ నుంచి సస్పెండైన శ్రీదేవి 50 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెబితే అచ్చెన్నాయుడు 50 మంది అంటే బాగుండదేమోనని 40 మంది ఎమ్మెల్యేలు అని చెప్పుకొస్తున్నారు. రోజూ ఫోన్లు చేసి పార్టీలో చేరతామంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి ఆ తర్వాత చేరికలపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయినా తమ పార్టీకి పొత్తులు కొత్తకాదని, ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని గెల్చుకోవడానికి తెలుగుదేశంపార్టీకి సహకరించిన నలుగురు ఎమ్మెల్యేలను ఆల్‌రెడీ పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. ఈ నలుగురు రేపోమాపో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇలాంటి వారు పార్టీలో ఇంకొందరు ఉంటారేమోనన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. టీడీపీ ఓ అడుగు ముందేకేసి ఎమ్మెల్యేల సంఖ్య కూడా చెబుతోంది. ఎన్నికలకు ఎంత కాదనుకున్నా ఏడాదిపైనే ఉంది. ఇటువంటి సమయంలో పార్టీ మారే సాహసం చేస్తారా? అన్నది అనుమానం. ఒకవేళ నిజంగానే పార్టీ మారాలనుకుంటే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నిర్ణయం తీసుకుంటారు. అచ్చెన్నాయుడు చెప్పినట్టు 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాష్ట్ర రాజకీయాల్లోనే పెను మార్పులు చోటు చేసుకుంటాయి. టీడీపీ కలలు కంటోందా? వైసీపీలో కల్లోలం నెలకుంటుందా? చూడాలి...

Updated On 28 March 2023 12:15 PM GMT
Ehatv

Ehatv

Next Story