కాణిపాకం(kanipakam) వినాయకుడికి ఇద్దరు భక్తులు అయిదు కోట్ల రూపాయల విలువైన 20 బంగారు బిస్కెట్లను(Gold biscuits) కానుకగా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు(Chittore) జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు.

కాణిపాకం(kanipakam) వినాయకుడికి ఇద్దరు భక్తులు అయిదు కోట్ల రూపాయల విలువైన 20 బంగారు బిస్కెట్లను(Gold biscuits) కానుకగా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు(Chittore) జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు వరాలను ఇస్తూ వరసిద్ధి వినాయకస్వామిగా పూజలను అందుకుంటున్నాడు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలోని వినాయక విగ్రహం పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. సత్యానికి మారు పేరుగా నిలిచిన వరసిద్ధి వినాయక స్వామిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. సత్య ప్రమాణం చేస్తారు. ఎన్‌ఆర్‌ఐలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌ అనే ఇద్దరు భక్తులు 20 బంగార బిస్కెట్లను స్వామివారికి కానుకగా ఇచ్చారు. భక్తులు ఇచ్చిన ఆరు కిలోల బంగారు బిస్కెట్లను స్వామి వారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించ నున్నారు..

Updated On 1 March 2024 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story