ఆంధ్రప్రదేశ్‌(AP) శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో వీధి కుక్క దాడిలో కన్నుమూసిన 18 నెలల చిన్నారి సాత్విక మృతదేహానికి రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని చిన్నారి సొంత ఊరు మెట్టవలసకు తీసుకొచ్చారు. ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న ఈ దుర్ఘటన జరిగింది. జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సాత్విక పై వీధి కుక్క దాడి చేసింది.

ఆంధ్రప్రదేశ్‌(AP) శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో వీధి కుక్క దాడిలో కన్నుమూసిన 18 నెలల చిన్నారి సాత్విక మృతదేహానికి రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని చిన్నారి సొంత ఊరు మెట్టవలసకు తీసుకొచ్చారు. ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న ఈ దుర్ఘటన జరిగింది. జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సాత్విక పై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే 18నెలల పసిపాప ప్రాణాలు విడిచింది. పండంటి బిడ్డ కళ్ల ముందే వీధి కుక్క దాడికి బలైపోవడం చూసి చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On 22 April 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story