భారత సాధారణ ఎన్నికలు-2024 ను పురస్కరించుకుని ఈనెల 13న హైకోర్టుకు ప్రభుత్వ సెలవుగా ఉత్తర్వులు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
భారత సాధారణ ఎన్నికలు-2024 ను పురస్కరించుకుని ఈనెల 13న హైకోర్టుకు ప్రభుత్వ సెలవుగా ఉత్తర్వులు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ-2024 ఎన్నికలు సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, హైకోర్టు పరిపాలనా పరిధిలో పనిచేస్తున్న కార్యాలయాల అధికారులకు, సిబ్బందికి సెలవుగా ప్రకటిస్తున్నామన్నారు. హైకోర్టు పాలనా పరిధిలో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఆంధ్ర ప్రదేశ్ జ్యూడిషియల్ అకాడమీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్లకు ఈ నెల 13వ తేదీ (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినట్లు లక్ష్మణరావు తెలిపారు.