13 feet King Cobra in Srikakulam : 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు
శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో 13 అడుగుల కింగ్ కోబ్రా(King Cobra) కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కంచిలి మండలం కుమ్మరినౌగాంలో నివాసాల వద్ద కింగ్ కోబ్రా తచ్చాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన వారు వెంటనే సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తికి సమాచారమందించారు. అతను చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. అధికారులు కింగ్‌కోబ్రాను అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

13 feet King Cobra in Srikakulam
శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో 13 అడుగుల కింగ్ కోబ్రా(King Cobra) కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కంచిలి మండలం కుమ్మరినౌగాంలో నివాసాల వద్ద కింగ్ కోబ్రా తచ్చాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన వారు వెంటనే సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తికి సమాచారమందించారు. అతను చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. అధికారులు కింగ్‌కోబ్రాను అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా కంచిలి మండల పరిధిలో జలంత్రకోట, బొగాబెణి తదితర ప్రాంతాల్లో ఇటీవల తరచూ కింగ్ కోబ్రాలు కనిపిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
రెండు రోజుల క్రితం ఇదే శ్రీకాకుళం జిల్లాలో 12 అడుగుల నాగు పాము హల్‌చల్ చేసింది. సోంపేటలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు 12 అడుగుల పాము తీవ్ర కలకలం రేపింది. భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ బాలయ్యకు సమాచారమిచ్చారు. అయన చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం అటవీ అధికారుల సూచనలతో అటవీ ప్రాంతంలో వదిలివేశారు. అయితే విషపూరితమైన పాములు ఎక్కువగా జనావాసాల్లో తిరగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
