YS Jagan : జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై మాజీ స్పీకర్ ఏం చెప్పారంటే...!
YS Jagan : జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై మాజీ స్పీకర్ ఏం చెప్పారంటే...!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thammineni sitaram) కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎంత మంది ఉన్నారన్నది ప్రధానం కాదని, ప్రతిపక్షం ఉన్నదా? లేదా? అన్నదే ముఖ్యమని తమ్మినేని సీతారాం వివరించారు. ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టే జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు వెళ్లారని సీతారాం అన్నారు. తెలుగుదేశంపార్టీ(Chandrababu) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని తమ్మినేని సీతారాం అన్నారు.