Sabitha Reddy : జగన్ కేసులపై మాజీ మంత్రి సబితారెడ్డి కీలక వ్యాఖ్యల

జగన్‌ (jagan)కేసులపై మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి (sabitha reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను కొట్టేందుకు, జగన్‌పై అక్రమ కేసులు బనాయించేందుకు నన్ను కూడా మధ్యలో ఇరికించారని సబిత ఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి(revanth reddy)తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి సబిత ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తామేదో ముంచుతామన్నట్లు ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడారని దానికి ఒత్తాసు పలుకుతూ ఉపముఖ్యమంత్రి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు. రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసి పోయారన్న వ్యాఖ్యలపై సబిత స్పందిస్తూ.. 20 ఏళ్ల పాటు పార్టీకి సర్వీస్‌ చేశానని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనను పార్టీలోకి ఆహ్వానించి అండదండగా ఉన్నారన్నారు. నమ్ముకున్న నాయకుడి వమ్ము కోల్పోకుండా కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం ఇల్లు ఇల్లు తిరిగి పనిచేశానని సబిత అన్నారు. 2014లో నాకు టికెట్ ఇవ్వలేదు, 2018లో నా కొడుక్కి టికెట్ ఇవ్వలేదు అయినా ఒక్క మాట మాట్లాడలేదని, సీఎం రేవంత్‌ను స్వయంగా నేనే పార్టీలోకి ఆహ్వానించి ఆశీర్వదించాని ఆమె అన్నారు. 2018లో నా కొడుక్కి టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకొని మాకు పొమ్మనకుండా పొగపెట్టారని అన్నారు. జగన్‌ను కొట్టేందుకు కేసులు పెట్టారని, కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడితే నాపై కేసులు పెట్టారని ఆవేదన చెందారు. జగన్‌ తర్వాత నాపైనే ఐదు కేసులు ఉన్నాయని, నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దగ్గరగా ఉన్నందునే నన్ను టార్గెట్‌ చేశారని చెప్పారు. జగన్‌ పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కాంగ్రెస్‌లో ఉండాలనే కోరుకున్నానని, అలాంటి పార్టీ తమపై కేసులు పెట్టి అవమానిస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కాంగ్రెస్‌ (congress) కోసం అహర్నిశలు కష్టపడ్డానని, కానీ అందులో ఉండకుండా బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Eha Tv

Eha Tv

Next Story