YS Jagan Fear in TDP? : టీడీపీలో జగన్ భయం..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ భారీ మెజార్టీతో ఏర్పాటైంది. ఆరేడు నెలలుగా పెన్షన్లు పెంచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటిన్లు ఓపెన్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ భారీ మెజార్టీతో ఏర్పాటైంది. ఆరేడు నెలలుగా పెన్షన్లు పెంచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటిన్లు ఓపెన్ చేశారు. అమరావతి పనులు ప్రారంభించారు. కానీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని ప్రతిపక్ష ఆరోపిస్తోంది. అమ్మ ఒడి, వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయారని ప్రధాన విమర్శ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది కాబట్టి ఇది మార్చాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం కావాలంటే బీజేపీతో పొత్తు కావాలని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సంపూర్ణ మద్దతు వచ్చింది. ప్రశాంతంగా పనిచేసుకునే వెసులుబాటు ప్రజలు గెలిపించారు. అయితే ఆరు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వస్తారన్న భయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ మాట స్వయాన చంద్రబాబే అంటున్నారు. మళ్లీ జగన్ వస్తే ఏమవుతుందోనని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చంద్రబాబే చెప్తున్నారు. ఇప్పటికే ఆ భూతాన్ని తరిమేశామని.. మళ్లీ ఆ భూతం వస్తుందేమోనని భయపడుతున్నారన్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!