Journalist YNR : జగన్ భద్రతలపై ఢిల్లీకి వైసీపీ..!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన చెందుతోంది.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన చెందుతోంది. అనంతపురంలో జరిగిన వ్యవహారం, అనంతపురం ఘటన ఆషామాషీగా జరగలేదని వైసీపీ భావిస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని స్వయంగా హోంమంత్రి వెల్లడించారు. ఇంత మంది భద్రత ఉన్నా వైఎస్ జగన్ హెలికాప్టర్ వద్దకు ఎందుకు చేరుకోలేకపోయారు. 1100 మంది ఉన్నా హెలికాప్టర్ వరకు రోప్ ఎందుకు క్రియేట్ చేయలేదు. హెలికాప్టర్ చుట్టూ బారికేడ్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు. అంత మంది ఉంటే అలా ఎలా జరుగుతుంది. 11 వందల మంది పోలీసులున్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ ఉందా. అంత మందిని కేటాయించినా మీ కార్యకర్తలు వచ్చి దాడి చేస్తుంటే మాకేంటి సంబంధం అన్నట్లు ప్రభుత్వం చెప్తే ఎలా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదా. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తే ఎలా. ఇది బాధ్యతారాహిత్యం కాదా.. ఇది చేతగాని తనం కాదా.. భవిష్యత్‌లో జగన్ పర్యటనలు ఇలాగే ఉంటాయని సందేశం ఇస్తున్నారా. ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం వ్వవహారం ఉండబోతుందా.. ఓ మాజీ ముఖ్యమంత్రి, వీఐపీకి భద్రత ఇలాగే కల్పిస్తారా అన్న సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఏం చేయబోతుంది..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ...
