AP Special Status : వైసీపీ హోదా ఎజెండా!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రత్యేక హోదా అంశం రాజకీయ నినాదంగానే మారిపోతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రత్యేక హోదా అంశం రాజకీయ నినాదంగానే మారిపోతున్నది. దాదాపు దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాకు(Special status) సంబంధించిన చర్చ, ఎన్నికల సందర్భంగా హామీలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రాదు అని ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ల ప్రత్యేకహోదాను ఇస్తామని ఆనాటి యూపీఏ సర్కారు హామీ ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే అయిదేళ్లు కాదు, పదేళ్ల ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పింది. బీజేపీ అలా అన్నది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తెలుగుదేశంపార్టీ(TDP) బీజేపీతో(BJP) పొత్తు పెట్టుకుంది. పవన్‌కల్యాణ్(Pawan kalyan) జనసేన(Janasena) కూడా సపోర్ట్‌గా నిలిచింది. ప్రజలు కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకంతో టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ప్రత్యేక హోదా మాత్రం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) సర్కారు ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామంటూ బీజేపీ చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ(Special package) కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, ప్రత్యేక హోదానే కావాలని టీడీపీ పట్టుపట్టింది. బీజేపీతో పోరాడింది. బీజేపీ కాదనే సరికి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఓడిపోయింది. ఆ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కూడా ప్రత్యేక హోదా అంశాన్నే ఎజెండాగా తీసుకుంది. హోదా కోసం తమ ఎంపీలు పోరాడుతున్నారని వైసీపీ చెబుతూ వచ్చింది. హోదాను సాధిస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చింది. తాము మద్దతు ఇస్తే తప్ప కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడని పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నామని, అది జరిగితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వైసీపీ తెలిపింది. ఎన్నికల తర్వాత బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో వైసీపీ అవసరం పడలేదు. తమ అవసరం బీజేపీకి పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాను తాము అడగలేమని వైసీపీ అప్పుడు చెప్పుకొచ్చింది. అసలు ఏపీకి హోదా వస్తుందా? రాదా? వస్తే ఎలా వస్తుంది? అన్నది ఈ వీడియోలో చూద్దాం