ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు(AP volunteers) సంబంధించిన చర్చ ఎన్నికల కంటే ముందు చాలా విస్తృతంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు(AP volunteers) సంబంధించిన చర్చ ఎన్నికల కంటే ముందు చాలా విస్తృతంగా జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా? వద్దా? వాలంటీర్లు ఎవరికి అనుకూలం? వారు చేస్తున్నదేమిటి? వాలంటీర్లు ఉంటే ఏ రాజకీయపార్టీకి లబ్ధి చేకూరుతుంది? ఇలా రకరకాల చర్చ వాలంటీర్లపైన జరిగింది. వాలంటీర్లపై నాలుగైదేళ్లుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు(Janasena) నెగటివ్‌ ప్రచారం చేస్తూ వచ్చాయి. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా కూడా వాలంటీర్లపై వ్యతిరేక వార్తలు రాస్తూ వచ్చింది. మగవాళ్లు ఇంట్లో లేని సమయంలో వచ్చి తలుపులు కొడుతున్నారని, మహిళల అక్రమ రవాణాకు(Women trafficking) కారణమవుతున్నారని, ప్రజల వ్యక్తిగత డేటాను తస్కరించి ఎక్కడో స్టోర్‌ చేస్తున్నారని, ప్రజలకు చెందాల్సిన పెన్షన్‌ డబ్బులను వారే దాచుకుంటున్నారని ఇలా అనేక అభియోగాలు, నిరాధార ఆరోపణలు వారిపై చేశాయి కూటమి పార్టీలు. ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ప్రేమను నటించింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని, వారినే కొనసాగిస్తామని చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్ట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చారు చంద్రబాబు(Chandrababu). వాలంటీర్ల జీతాన్ని అయిదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచుతామని కూడా చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్నదుష్ప్రచారాన్ని నమ్మకండని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను తొలగించనని చంద్రబాబు మాట ఇచ్చారు. నారా లోకేశ్‌ కూడా ఇదే మాట అన్నారు. వాలంటీర్లను తొలగించే ప్రసక్తే లేదని లోకేశ్‌ పదే పదే చెప్పుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయి కూడా అయిదారు నెలలు దాటింది. ఇప్పటి వరకు వాలంటీర్ల సంగతి తేల్చలేదు. పది వేల రూపాయల జీతం పెంచడం అటుంచి, అసలు వారికి ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదు.

Updated On 10 Nov 2024 5:10 AM GMT
Eha Tv

Eha Tv

Next Story