పాస్టర్‌ ప్రవీణ్‌ మరణానికి సంబంధించిన విషయంపై రాష్ట్రంలో గత కొద్ది కాలంగా చర్చ జరుగుతోంది.

పాస్టర్‌ ప్రవీణ్‌ మరణానికి సంబంధించిన విషయంపై రాష్ట్రంలో గత కొద్ది కాలంగా చర్చ జరుగుతోంది. పాస్టర్‌ ప్రవీణ్‌ (Pastor Praveen)మరణంపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మరణం వెనుక కుట్ర ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్‌(Harsha kumar) గత కొంతకాలంగా మాట్లాడుతున్నారు. ఆయనతోపాటు దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా పాస్టర్ ప్రవీణ్‌ మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. హత్యకు ఉన్న పాజిటిబులిటీపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేస్తున్నారు. బైక్‌ను ఏదో గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొట్టిందంటున్నారు. కావాలనే ఎవరో తన బైక్‌ను ఢీకొట్టించారని అంటున్నారు. యాక్సిడెంట్‌ జరిగితే ఆయనపై బైక్‌ను ఎవరో కావాలనే పెట్టినట్టు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. బైక్‌ను కిందపడితే ఆయనకు అన్ని గాయాలు ఎలా ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయి. అయితే పాస్టర్ ప్రవీణ్‌ కుటుంబసభ్యులు మాత్రం మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్తూ వస్తున్నారు. తమకు పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని.. అసలు నిజాలు పోలీసులే బయటపెట్టాలని వారూ చెప్తూ వచ్చారు. అయితే పాస్టర్‌ ప్రవీణ్‌పై చాలా మంది ఆయన అభిమానులు, బయట వ్యక్తులు మాత్రం దీని వెనుక కుట్ర ఉందనే చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మరణం తర్వాత కొన్ని సీసీటీవీ(CCTV) ఫుటేజ్‌లు బయటకు వచ్చాయి. ఇందులో ఉన్నది పాస్టర్ ప్రవీణేనని ప్రచారం జరిగినా ఈ వీడియోలు కూడా కుట్రలో భాగమేనన్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు రావడానికి ఆలస్యానికి గల కారణాలేంటి. విచారణ జరుగుతుండగానే వీడియోలు ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఏం చేప్తున్నారు.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story