లేడీ అఘోరీ, అలియాస్ అల్లూరి శ్రీనివాస్ లేదా శివ విష్ణు బ్రహ్మ అట్లూరి(Shiva Vishnu Brahma Atluri) అని పిలుచుకునే వ్యక్తి, తెలంగాణలో గత కొన్ని నెలలుగా వివాదాల కేంద్రంగా ఉంది.

లేడీ అఘోరీ, అలియాస్ అల్లూరి శ్రీనివాస్ లేదా శివ విష్ణు బ్రహ్మ అట్లూరి(Shiva Vishnu Brahma Atluri) అని పిలుచుకునే వ్యక్తి, తెలంగాణలో గత కొన్ని నెలలుగా వివాదాల కేంద్రంగా ఉంది. ఆమె తనను నాగ సాధువుగా(Naga Sadhu), సనాతన ధర్మ రక్షకురాలిగా చెప్పుకుంటూ, మహిళల రక్షణ, దేశ రక్షణ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని ప్రచారం చేసుకుంటోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూర్‌కు చెందిన ఓ మహిళా ప్రొడ్యూసర్, లేడీ అఘోరీపై సైబరాబాద్ (Cyberabad)మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె "యోని పూజ"(Yoni Puja) చేస్తానని, సమస్యలు తీరుస్తానని చెప్పి రూ. 9.8 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో 2025 ఫిబ్రవరి 25న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ, లేడీ అఘోరీతో ఆరు నెలల క్రితం పరిచయమైందని, రెండు నెలల తర్వాత ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చినప్పటి నుంచి తరచూ ఫోన్‌లో మాట్లాడి, వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, పూజల మాటలతో నమ్మించి డబ్బులు తీసుకుందని చెప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో తురిమెళ్ల కోటయ్య అనే వ్యక్తి, లేడీ అఘోరీ తన కూతురు శ్రీ వర్షిణిని మాయమాటలతో, వశీకరణ పూజలతో ఆశ్రమానికి తీసుకెళ్లిందని ఫిర్యాదు చేశాడు. శ్రీ వర్షిణి అనే యువతిని అఘోరీ పెళ్లి చేసుకుంది. ఆమె కూతురు ఇప్పుడు తమ మాట వినడం లేదని, అఘోరీ బ్రమలో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. లేడీ అఘోరీ ఆలయాల్లో, సామాజిక కార్యక్రమాల్లో తన ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంది. కొందరు ఆమెను సనాతన ధర్మ వ్యతిరేకిగా కూడా ఆరోపించారు. ఆమె తన వ్యతిరేకులపై దూషణలు, బెదిరింపులకు దిగుతుందనే ఆరోపణలూ ఉన్నాయి.
