అధికారులపై(Revenue Officials) జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ వి.లచ్చిరెడ్డి(V.Lachchi Reddy) తీవ్రంగా ఖండించారు.

వికారాబాద్(Vikarabad) జిల్లాలో కలెక్టర్(Collector), అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై(Revenue Officials) జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ వి.లచ్చిరెడ్డి(V.Lachchi Reddy) తీవ్రంగా ఖండించారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన వారిపైనా, దాడికి పాల్పడిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు(Punishment) తీసుకోవాలని కోరతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో

ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవిన్యూ అధికారులు, సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఈ సమయంలోనే కొందరు అధికారులపై దాడులు చేశారు. వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఇలాంటి దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని లచ్చిరెడ్డి చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story