TPCC President Mahesh Kumar Goud : టార్గెట్ ఫిక్స్ చేసిన కొత్త పీసీసీ అధ్యక్షుడు

పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తాన‌ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-09-23 02:07 GMT

పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తాన‌ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతాన‌ని.. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటాన‌ని.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటాన‌ని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఇంచార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉందన్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను గెలవాలని టార్గెట్ ఇచ్చారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది.. కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం అని పేర్కొన్నారు.

నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశాం.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేద్దాం అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.

కేసీఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు..కేసీఆర్ పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయాడని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణం.. రాహుల్ ను ప్రధానిని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలన్నారు. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ లు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఉంటాయన్నారు. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు వెళ్తాన‌ని.. రెండోసారీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. 

Tags:    

Similar News