Jishnu Dev Varma : తెలంగాణ గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం
నేడు హైదరాబాద్‌కు తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్నారు. జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు
నేడు హైదరాబాద్‌కు తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్నారు. జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరవుతారు.
జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న త్రిపుర రాజా కుటుంబంలో జన్మించాడు. ఆయన గతంలో 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆయన త్రిపురలోని చరిలం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. జిష్ణు దేవ్ వర్మకు భార్య సుధా దేవ్‌వర్మ, కుమారులు ప్రతీక్ కిషోర్ దేవ్ వర్మ, జైబంత్ దేవ్ వర్మ ఉన్నారు.