డిసెంబర్ 28 శని త్రయోదశి చాలా విశేషమైన రోజు అని పండితులు చెప్తున్నారు.

డిసెంబర్ 28 శని త్రయోదశి చాలా విశేషమైన రోజు అని పండితులు చెప్తున్నారు. జీవితంలో ఏలినాటి శని, అర్ధమశని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, చాలా కాలంగా ఇబ్బందులు వస్తున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా.. ఆరోజు దీపాన్ని ఇలా వెలిగించాలని చెప్తున్నారు. ఈ ఒక్క దీపాన్నివెలిగిస్తే చాలు. అన్నీ తొలగిపోతాయి. నల్ల బట్టలో నువ్వులు పోసి నల్ల దారంతో దానిని కట్టి శనిదేవుడిని తలుచుకోవాలి. ఒక ప్రమిదలో ఒక ఇనుపముక్కను వేసి ప్రమిదలో ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె పోసి శనేశ్వరం ముందు ఉంచి దీపాన్ని వెలిగించాలి. శనేశ్వరం లేకుంటే దగ్గరలోని ఆలయంలో ఉండే నవగ్రహాల వద్ద ఉన్న శనిదేవుడి ఎదుట వెలిగించాలి. లేదా హనుమాన్‌ మందిరంలో హనుమాన్‌ ముందు వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో '' నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజం.. ఛాయ మార్తాండయ సంభూతం..తంనమామి శనేశ్చరం'' అనే మంత్రాన్ని 11 సార్లు చదవాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కుని పక్కనే ఉన్న దేవుడిని దర్శించుకోని ఇంటికి రావాలని పండితులు చెప్తున్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే ఎవరికి వారు వేర్వేరుగా ఈ దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇంట్లో వ్రతం జరిగుతుండగా వెలిగించకూడదని సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story