తెలంగాణలో శాంతిభద్రతలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ.

తెలంగాణలో శాంతిభద్రతలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క (Deputy CM bhatti Vikramarka)ఇంట్లో దొంగతనం జరిగేంత శాంతిభద్రతలు ఉన్నాయి. భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం వార్త ఇప్పుడు దావనంలా వ్యాపించింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌(Kharagpur Railway Station)లో నిందితులను అరెస్ట్ చేసిన బెంగాల్(West Bengal) పోలీసులు. భట్టి విదేశీ పర్యటనలో ఉన్నారు. దొంగలు ఆయన ఇంటి తాళం పగులగొట్టి బంగారు(Gold), వెండి(Silver) ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. దొంగతనంపై భ‌ట్టి కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాత్రి పశ్చిమ బెంగాల్‌‎లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌(Bihar)కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌(Roshan Kumar Mandal), ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌(Uday kumar Tagore)గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్‌పూర్‌ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రా. బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

ehatv

ehatv

Next Story