Raja Singh: ఓవైసీ కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పండి: రాజా సింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైడ్రా విషయంలో సంచలన

Update: 2024-09-08 09:00 GMT

రాజా సింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

హైదరాబాద్ నగరంలో హైడ్రా ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా ద్వారా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైడ్రా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని హైడ్రా చీఫ్ రంగనాథ్ ను రాజా సింగ్ ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారని అన్నారు. వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


హలాల్ వస్తువులకు దూరంగా ఉండండి:
గణేష్ ఉత్సవాల సందర్భంగా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హిందువులను కోరారు. చాలా కాలంగా హలాల్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రాజా సింగ్ తన వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు. హలాల్ ధృవీకరణతో వచ్చే వస్తువులను కొనుగోలు చేయవద్దని హిందువులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ముస్లింలు కొన్ని కారణాల వల్ల హలాల్ సర్టిఫికేట్ ఉత్పత్తులను ఇష్టపడతారు. తెలిసో తెలియకో వ్యాపారులు హిందువులకు కూడా హలాల్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని రాజా సింగ్ శనివారం నాడు వీడియోను విడుదల చేశారు.


Tags:    

Similar News