Hyderabad : తాగి ఆగట్లే.. తోలుతున్నారు.. అందుకే 10 రోజుల్లో 1,614 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10 రోజుల్లో 1,614 మంది తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకున్నారు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10 రోజుల్లో 1,614 మంది తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకున్నారు. మరోవైపు గతంలో కోర్టుల్లో ఉన్న కేసులతోపాటు 992 చార్జిషీట్లను పోలీసులు దాఖలు చేశారు. వారిలో 55 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలుకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ మేజిస్ట్రేట్ మొత్తం రూ.21,36,000 జరిమానా విధించింది. ఎనిమిది మంది డ్రైవింగ్ లైసెన్సులను కూడా సస్పెండ్ చేశారు. మొత్తం కేసుల్లో ద్విచక్ర వాహనాలపై 1,346 కేసులు నమోదయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవింగ్ పరీక్షల్లో ఈ వాహనదారులు పట్టుబడ్డారు.
మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాపాయానికి కారణమైనా.. ప్రమాదాలకు కారణమైనా.. అటువంటి వ్యక్తులను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద అరెస్టు చేసి జైలుకు పంపుతారు. దీనికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది.