Nerella Sharada : జానీ మాస్టర్ బాధిత మహిళకు అండగా ఉంటాం

నేను బాధ్యతలు తీసుకొని రెండు నెలలు.. అనేక కేసులు నా దృష్టికి వస్తున్నాయని తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద తెలిపారు

Update: 2024-09-18 13:50 GMT

నేను బాధ్యతలు తీసుకొని రెండు నెలలు.. అనేక కేసులు నా దృష్టికి వస్తున్నాయని తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద తెలిపారు. ఆమె బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌ను మీడియా ముందు మాట్లాడాలని అడుగుతున్నరు.. లైంగిక వేదింపులు అనేది పెద్ద సమస్య.. బయటికి వచ్చి చెప్పుకోవడానికి కూడా మహిళలు చెప్పుకోలేక పోతున్నారని అన్నారు. ఉద్యోగాలు పోతాయని, పరువు లాంటి అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయన్నారు. మహిళలకు స్వేచ్ఛ అవసరం అన్నారు. కోలకత్తా ఘటన కూడా చూశాం.. పాశవికంగా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసారు.. ఒక చట్టం కూడా ఉంది.. రెండు కమిటీలు కూడా వేశారన్నారు.

జానీ మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న లేడి కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించారు. మాకు కూడా ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలపై ఎవరు అసభ్యంగా ప్రవర్తించిన వదిలేది లేద‌న్నారు. మహిళలు ఏ రంగంలో ఉన్నా మీకు ఏ ఇబ్బందీ కలిగిన మాకు తెలియజేయండని సూచించారు. జానీ మాస్టర్ బాధిత మహిళకు అండగా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేదు. పోలీసులకు కూడా ఆమెకి సెక్యూరిటీ ఇవ్వాలని అదేశిస్తానని తెలిపారు.  

Tags:    

Similar News