MP Chamala Kiran Kumar Reddy : అందుకే 8 స్థానాలు వ‌చ్చాయి.. పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీకి వివరించా

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీ కి వివరించడం జరిగిందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు

By :  Eha Tv
Update: 2024-07-11 14:22 GMT

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీ కి వివరించడం జరిగిందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 , 13 సీట్లు వచ్చేవి.. కానీ బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత పొత్తుతో 8 కి పడిపోయిందన్నారు. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువగా ఓట్లు పోలయ్యాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయన్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలు జరిగాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని రెండో స్థానంలో ఉంచాలనే ఆలోచనతో చాలా ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ సరైన అభ్యర్థులను బరిలోకి దించలేద‌న్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ అయింది కాబట్టి 12 స్థానాలు రావలసిన కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చాయని.. బీజేపీకి 8 స్థానాలు వచ్చాయన్నారు. 

Tags:    

Similar News