Asaduddin Owaisi: ఫలితాల నుండి మోదీ ప్రభుత్వం ఇంకా ఏమీ నేర్చుకోలేదు

By :  Eha Tv
Update: 2024-06-16 03:37 GMT

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) పై పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ఫలితాల నుండి ప్రధాని నరేంద్ర మోదీ ఏదో నేర్చుకున్నారని తాను ఆశించానని.. అయితే వారు నా అంచనాలపై నీటిని చల్లారని విమర్శించారు అసదుద్దీన్. “యుఎపిఎ చట్టం ఈరోజు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇది అత్యంత క్రూరమైన చట్టం, దీని కారణంగా వేలాది మంది ముస్లిం, దళిత, గిరిజన యువకులు జైలు పాలయ్యారు. వారి జీవితాలను నాశనం చేశారు” అని ఒవైసీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

85 ఏళ్ల స్టాన్ స్వామి మరణానికి ఈ చట్టమే కారణమని ఆయన ఆరోపించారు. “ఈ చట్టాన్ని 2008, 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది, అప్పుడు కూడా నేను దానిని వ్యతిరేకించాను. 2019లో, బీజేపీ మళ్లీ దానిపై మరింత కఠినమైన నిబంధనలు, మినహాయింపులు తీసుకువచ్చినప్పుడు, కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది. నేను అప్పుడు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాను, ”అని అసదుద్దీన్ చెప్పారు. లోక్‌సభలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం బిల్లు 2019పై AIMIM చీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. UAPA చట్టాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్‌ను నిందించారు.


Similar News