Minister Ponguleti Srinivasa Reddy : ఆ జోన్‌లో నా ఫాంహౌస్ ఉన్నా కూల్చేయండి

మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యం అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది

Update: 2024-08-23 13:05 GMT

మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యం అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు వెళ్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. హిమాయత్ సాగర్ పరిధిలో నా ఫాం హౌస్ ఉంది అంటున్నారు. హైడ్రా ప్రభుత్వ స్థలాల విషయంలో.. కీలకంగా వ్యవహరిస్తుంది. FTL.. బఫర్ జొన్ లలో కట్టడాల మీద గత ప్రభుత్వం ను కోర్టు అనేక సార్లు సూచనలు చేసిన చర్యలు తీసుకోలేదు. నాది ఒకటే ఛాలెంజ్ హారీష్ రావు, కేటీఆర్ వాళ్ళ తోత్తులు ఎప్పుడు వస్తారో రండి.. రంగనాథ్‌ను కూడా అదేశిస్తున్న రండి. కొత్త టేపు కొనుక్కొని రండి.. నా ఇళ్లు FTF, బఫర్ జోన్ లో ఉన్నా కూల్చేయండి. లేదంటే మీ తల ఎక్కడ పెట్టుకోవాలి డిసైడ్ చేసుకోండి. నేను అక్కడే నివాసిస్తున్నాను. మీలాగా నేను నా ఫ్రెండ్ దగ్గర లీజ్ తీసుకున్న అని చెప్ప‌ను అన్నారు.

రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేశారు.. అని FIRలో కేటీఆర్ ఇల్లు అని రాశారు కదా.. ఆ ఇల్లు నాది కాదు.. నా కొడుకు పేరిట ఉంది. హైడ్రా ఇంప్లిమెంట్ చేస్తుంటే భయం ఎందుకు అని ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వంలో పేదల భూములు.. ప్రభుత్వం భూములు లకున్నారో అవి పేదలకు పంచుతామ‌న్నారు. హైడ్రాను ప్రజలు అభినందిస్తున్నారు. అక్రమాలను కూల్చేస్తుంటే మీకు ఎందుకు కడుపు నొప్పి.. మా పార్టీ నాయకుడు పల్లం రాజు సోదరుడు స్థలం ఉన్నా కొట్టేశారన్నారు. కేటీఆర్ ఆ ఫాం హౌస్ ఎంతకూ లీజీ తీసుకున్నారో చెప్పండి.. ఐదు వేలకు అయితే అందరం తీసుకుంటామ‌న్నారు. త‌న‌ ఛాలెంజ్ ను ప్రధాన ప్రతిపక్షం స్వీకరించాలని కోరారు. 

Tags:    

Similar News