Sangareddy : మైనర్ బాలికపై అత్యాచారం-హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

సంగారెడ్డిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష విధించింది

Update: 2024-09-13 04:24 GMT

సంగారెడ్డిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష విధించింది సంగారెడ్డి ప్రత్యేక కోర్టు. జిల్లాలో 27 ఏళ్లలో ఇదే తొలి మరణశిక్ష అని సంగారెడ్డి ఎస్పీ సీహెచ్ రూపేష్ తెలిపారు. ఈ సంఘటన అక్టోబర్ 16, 2023 న జరిగింది, నిందితుడు బీహార్‌కు చెందిన వలస కూలీ. బాలికకు శీతల పానీయంలో మ‌త్తు ముందు ఇచ్చి సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేశాడు. బీహార్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులు కూడా అదే ప్రాంతంలో నిందితుడితో పాటు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత CCTV ఫుటేజీ, ప్ర‌త్య‌క్ష సాక్షుల ఆధారంగా నేరస్థుడిని గుర్తించి మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ త‌ర్వాత విచార‌ణ‌లో నేరం చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. నేరం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో సంగారెడ్డి పోలీసులు ఫాస్ట్ ట్రాక్ విచారణను కోరారు. దీంతో గురువారం సంగారెడ్డి పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడికి మరణశిక్షను ఖరారు చేస్తూ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

Tags:    

Similar News