తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana congress) ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana congress) ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులపై కాంగ్రెస్‌లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న జీవన్‌రెడ్డి(Jeevan reddy).. తనకు చెప్పకుండానే జగిత్యాల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారన్నారు. దీంతో గత 4 నెలలుగా తీవ్ర మనోవేదనతో ఉన్నట్లు జీవన్‌రెడ్డి అన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాల్సిందేనని(MLA disqualification) ఆయన తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. అయితే జగిత్యాలలో గంగారెడ్డి(Ganga reddy) అనే కాంగ్రెస్‌ నాయకుడి హత్యతో(Murder) ఈ డిమాండ్‌ మరింత పెరిగింది. తన అనుచరుడు గంగారెడ్డి హత్యకు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయే కారణమని బహిరంగంగా విమర్శలు చేశారు. ఫిరాయింపులు లేకుంటే గంగారెడ్డిని కోల్పోయేవాడిని కాదని జీవన్‌రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్(Mahesh kumar goud) బుజ్జగించినా ఆయన వినలేదు. మీకు మీ పార్టీకో దండం అంటూ ఫోన్ కట్‌ చేశారు. గత మూడు రోజులుగా ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దీంతో జీవన్‌రెడ్డిని పరామర్శించేందుకు మధుయాష్కీగౌడ్‌(Madhu yashki Goud) వెళ్లారు. జీవన్‌రెడ్డిని పరామర్శించిన తర్వాత మధుయాష్కీ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ప్రేమతో చేరలేదని.. తమ సొంత ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీ ఫిరాయించారని మధుయాష్కీ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ సిద్ధాంతాలు తెలియవని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్‌ అవుతారన్నారు. జీవన్‌రెడ్డి జీవితమంతా కాంగ్రెస్‌తోనే ఉన్నారని.. ఆయనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ పార్టీ మారలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారని.. జీవన్‌రెడ్డిలాంటి నేతలను పార్టీ కాపాడుకోవాలన్నారు. మధయాష్కీ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైడ్రాకు వ్యతిరేకంగా కూడా మధుయాష్కీ మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటానని ఎల్బీనగర్‌లో పర్యటిస్తూ చెప్పారు. తాజా ఫిరాయింపుదారులపై ధిక్కార స్వరం వినిపించడంతో.. సీఎం రేవంత్‌ వ్యవహారశైలిపై బాహాటంగానే ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్పడంతో రేపు రేపు ఇంకా ఎంత మంది నేతలు వస్తారోనన్న అభిప్రాయం వెల్లడువతోంది.

Eha Tv

Eha Tv

Next Story